News11th Dec 11:56 AMSunil Byrisetty1 min read
బీజేపీ 'అటల్-మోదీ సుపరిపాలన' బస్సు యాత్ర
ఏపీలో బీజేపీ వ్యూహాత్మక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. మాజీ ప్రధాని, దివంగత వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్ల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా బీజేపీ
ఏపీలో బీజేపీ వ్యూహాత్మక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. మాజీ ప్రధాని, దివంగత వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్ల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా బీజేపీ ఇవాల్టి నుంచి 'అటల్-మోదీ సుపరిపాలన' బస్సు యాత్ర చేపట్టింది. రాయలసీమలోని ధర్మవరం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మోదీ ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటన అనంతరం ఈ నెల 25న అమరావతిలో జరిగే ముగింపు సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు. ఈ యాత్రను బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.