Politics27th Aug 04:15 PMSunil Byrisetty1 min read
ఏకగ్రీవాలపై మాట మార్చిన జగన్!
వైసీపీ అధినేత జగన్ ద్వంద్వ విధానాలు, అవకాశవాద రాజకీయాలపై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ విరుచుకుపడ్డారు. అధికారంలో ఉంటే ఒక నీతి, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రీతిగా
వైసీపీ అధినేత జగన్ ద్వంద్వ విధానాలు, అవకాశవాద రాజకీయాలపై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ విరుచుకుపడ్డారు. అధికారంలో ఉంటే ఒక నీతి, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రీతిగా మాట్లాడటం జగన్ నైజమని మండిపడ్డారు. 'నాటి జగన్ వర్సెస్ నేటి జగన్' తీరును ఎండగడుతూ ఆమె పలు సూటి ప్రశ్నలను సంధించారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏకగ్రీవమైతే కోట్లాది రూపాయల నజరానాలు ప్రకటిస్తామని చెప్పిన జగన్ రెడ్డి, నేడు అదే ఏకగ్రీవాలను వికృతం అని మాట్లాడటం ఆయన కపటత్వానికి నిదర్శనం" అని యామిని శర్మ ధ్వజమెత్తారు. నాడు ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి మచ్చుతునక అన్న నోటితోనే, నేడు ప్రజాస్వామ్య ఖూనీ అనడం సిగ్గుచేటన్నారు. సీటు మారితే మాట, స్టేటస్ మారితే సిద్ధాంతం మార్చడం జగన్‌కే చెల్లిందని, నాడు మీ దృష్టిలో ఏకగ్రీవం అంటే డెవలప్‌మెంట్ అయితే, మరి నేడు అది డిక్టేటర్‌షిప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.