Politics13th Mar 05:10 PMSunil Byrisetty1 min read
సొంత పార్టీపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం!
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. ఆయన ఏది మాట్లాడినా వివాదాస్పదం
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. ఆయన ఏది మాట్లాడినా వివాదాస్పదంగానే ఉంటుంది.
తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.
ఈసారి సొంత పార్టీలోని నేతలపైనే బాణాలు ఎక్కుపెట్టారు. తెలంగాణలో హిందువులు సేఫ్‌గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు.
అయితే అధికారంలోకి రావాలంటే.. పార్టీలోని పాత సామానును సాగనంపాలన్నారు. పార్టీ అంటే నేనే అనుకొనే కొంత మంది వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. వారిని సాగనంపితేనే.. రాష్ట్రంలో పార్టీకి మనుగడ అంటూ రాజాసింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు.