News2nd Apr 02:53 PMSunil Byrisetty1 min read

ఢిల్లీలో తెలంగాణ బీజేపీ సేవ్ హెచ్‌సీయూ

హెచ్‌సీయూ భూముల వ్యవహారం తెలంగాణను అట్టుడికిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములను జేసీబీలతో చదును చేస్తుండటంపై బీఆర్ఎస్, బీజేపీ, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనననలు చేస్తు్న్నారు.

ఢిల్లీలో తెలంగాణ బీజేపీ సేవ్ హెచ్‌సీయూ
హెచ్‌సీయూ భూముల వ్యవహారం తెలంగాణను అట్టుడికిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములను జేసీబీలతో చదును చేస్తుండటంపై బీఆర్ఎస్, బీజేపీ, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనననలు చేస్తు్న్నారు. ఈ క్రమంలో హెచ్‌సీయూ భూముల వేలం వివాదంపై స్పందించాలని మంగళవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు తెలంగాణ బీజేపీ ఎంపీలు వినతి పత్రం అందజేశారు. వేలాదిగా నెమళ్ళు, జింకలు, ఇతర వ‌న్యప్రాణుల‌కు నిల‌యమైన హెచ్‌సీయూ భూముల వేలాన్ని ఆపాల‌ని కోరారు. ఈ భూముల వేలం ద్వారా వేల సంఖ్యలో వన్యప్రాణులు మృతి చెందుతున్నాయని తెలిపారు. రాత్రికి రాత్రి అమానుషంగా మూగజీవాలపై బుల్డోజర్లు తోలుతున్నారని ఆరోపించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వెంట‌నే రాష్ట్ర ప్రభుత్వం వేలంపాట ప్రక్రియ ఆపే విధంగా ఆదేశాలివ్వాల‌ని భూపేందర్‌ను కోరారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌, బీజేపీ ఎంపీలు ఈటెల‌ రాజేందర్, ర‌ఘునంద‌న్‌ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.
MP Konda Vishweshwar Reddy
Union minister Bhupender Yadav
Delihi
హెచ్‌సీయూ
Scroll for the next article