Politics18th Aug 12:44 PMSunil Byrisetty1 min read

విశాఖలో బీజేపీ పదాధికారుల సమావేశం

విశాఖపట్నంలోని ఎన్ కన్వెన్షలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్, జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ జీ, రాష్ట్ర అధ్

విశాఖలో బీజేపీ పదాధికారుల సమావేశం
విశాఖపట్నంలోని ఎన్ కన్వెన్షలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్, జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ జీ, రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో కలిసి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, మండల, జిల్లా, శక్తి కేంద్రం, బూత్ స్థాయిల్లో క్రమబద్ధమైన సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలతో నిరంతర అనుసంధానం కొనసాగించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయడం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలు బీజేపీపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ప్రతి స్థాయిలో కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని సేవ చేయాల్సిన అవసరంపై కూడా సమావేశంలో చర్చించారు.
Andhra Pradesh BJP
BJP
Visakhapatnam
Nitin Nabin
B.L. Santosh
Shiva Prakash
PVN Madhav
Satya Kumar Yadav
BJP Office Bearers
ఏపీ బీజేపీ
ఎంపీలు
ఎమ్మెల్యేలు
జిల్లా అధ్యక్షులు
బూత్ స్థాయి సంస్థాగత నిర్మాణం
Scroll for the next article