News8th Sep 01:42 PMSunil Byrisetty1 min read

రాజమహేంద్రవరంలో 'బీజేపీ వంద జెండాల పండుగ'

రాజమహేంద్రవరంలో 'బీజేపీ వంద జెండాల పండుగ' ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని అన్ని డివిజన్లలో బీజేపీ నేతలు జెండాలు ఎగురవేశారు. ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గ

రాజమహేంద్రవరంలో 'బీజేపీ వంద జెండాల పండుగ'
రాజమహేంద్రవరంలో 'బీజేపీ వంద జెండాల పండుగ' ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని అన్ని డివిజన్లలో బీజేపీ నేతలు జెండాలు ఎగురవేశారు. ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. కార్యక్రమానికి బీజేపీ ఎంపీ పురందేశ్వరి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కంబాల చెరువు వద్ద బహిరంగ సభలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఎంపీ పురందేశ్వరి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. కూటమి నేతలను గెలిపించేలా కార్యకర్తలు కృషి చేయాలని పురందేశ్వరి కోరారు.
Andhra Pradesh
BJP 100 Flags Festival
Rajamahendravaram
BJP Andhra Pradesh
Madhav
Daggubati Purandeshwari
BJP Leaders
Local Body Elections
స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
బీజేపీ కార్యకర్తలు
కూటమి
కంబాల చెరువు
బీజేపీ
Scroll for the next article