Politics10th Sep 06:17 PMSunil Byrisetty1 min read
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విస్తరణకు బీజేపీ ప్రణాళిక
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విస్తరణకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగా రాజధాని జిల్లా అయిన అమరావతి నుంచి ప్రాతినిధ్యం కోరాలని ఢిల్లీ నుంచి కూడా గట్టి సంకేతాలు వచ్చినట
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విస్తరణకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగా రాజధాని జిల్లా అయిన అమరావతి నుంచి ప్రాతినిధ్యం కోరాలని ఢిల్లీ నుంచి కూడా గట్టి సంకేతాలు వచ్చినట్లు సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు తొలి దశలో జరిగే ఎన్నికల్లో తమ వాటా కోరేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ప్రధానంగా.. రాజధాని జిల్లా అయిన అమరావతి నుంచి ఇప్పటివరకూ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. విజయవాడ నుంచి పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నందున.. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ రాజధాని నగరమైన గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్న పట్టుదలతో ఉంది. అమృత్ పథకం ద్వారా అమరావతికి వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇస్తున్నామని, రాజధాని పనుల్లో 80 శాతం వాటా కేంద్రం ఇస్తున్నదే కాబట్టి, గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండాలని జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. పైగా గుంటూరు నగరంలో బ్రాహ్మణ–వైశ్య వంటి బీజేపీ సానుకూల వర్గాల జనాభా ఎక్కువగా ఉన్నందున, అక్కడ కార్పొరేషన్ గెలవడం సులభమవుతుందన్నది బీజేపీ అంచనాగా కనిపిస్తోంది.