Politics12th Jul 03:17 PMSunil Byrisetty1 min read

మీ కుట్రలకు దళితులను వాడుకోవద్దు.

రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దళిత సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ అన్నారు. జడా శ్రవణ్, ప్రకాష్ రాజ్ పై ఉపా యాక్ట్ కింద కే

మీ కుట్రలకు దళితులను వాడుకోవద్దు.
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దళిత సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ అన్నారు. జడా శ్రవణ్, ప్రకాష్ రాజ్ పై ఉపా యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రావణ్ హైందవ ధర్మంపై మాటల యుద్ధం ప్రారంభం చేసిన 24 గంటల తరువాత జడ శ్రవణ్ ఇదే వ్యాఖ్యలు చేశారని ఆగ్రహించారు. మరో 48గం దాటిన తర్వాత ప్రకాష్ రాజ్ తన వైఖరిని వెల్లడించాడని మండిపడ్డారు. ఆ తర్వాత రోజు వామపక్ష నేత రామకృష్ణ స్పందించారన్నారు. వైసీపి వీరందరి వ్యాఖ్యలకు చంకలు గుద్దుకుంటూ పైశాచిక ఆనందం వ్యక్తం చేస్తూ వచ్చిందని వారి వ్యవహారాన్ని సురేష్ కుండ బద్దలు కొట్టారు. దళితులపై ఎలాంటి అన్యాయం జరిగినా బీజేపీ ఎస్సీ మోర్చా అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Andhra Pradesh BJP
Panathala Suresh
BJP SC Morcha
Dalit Welfare
NDA Government
UAPA
Prakash Raj
Jada Sravan
YSRCP
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
రాజకీయ వివాదం
Scroll for the next article