Politics31st Aug 05:28 PMSunil Byrisetty1 min read

స్థానికంలో బీజేపీ పట్టు.. కూటమిలో సీట్లు దక్కేనా?

దేశంలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ రాష్ట్రంలో మాత్రం కూటమిలో అప్రాధాన్య పార్టీగా ఉందా?. రాష్ట్రంలోని బీజేపీ నేతలు అలాగే అంటున్నారు. కేంద్రంలో కీలకంగా ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం జనసేన

స్థానికంలో బీజేపీ పట్టు.. కూటమిలో సీట్లు దక్కేనా?
దేశంలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ రాష్ట్రంలో మాత్రం కూటమిలో అప్రాధాన్య పార్టీగా ఉందా?. రాష్ట్రంలోని బీజేపీ నేతలు అలాగే అంటున్నారు. కేంద్రంలో కీలకంగా ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం జనసేన కంటే కూడా తక్కువ ప్రాధాన్యత లభిస్తోందన్న ఆవేదన కాషాయదళంలో ఉంది. రెండేళ్లలో దక్కిన నామినేటెడ్ పదవుల విషయం తీసుకుంటే బీజేపీకి చెప్పుకోదగినవేవీ ఇవ్వలేదన్న అసంతృప్తి కూడా పార్టీలో ఉంది. ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుబట్టేందుకు సరైన అవకాశం వచ్చిందని ఏపీ బీజేపీ భావిస్తోంది. పట్టు పట్టి మేయర్ సీట్లను దక్కించుకోవాలని నిర్ణయించుకుంది. సంస్థాగతంగా కొంత బలం ఉన్న చోట మేయర్ సీట్లు తీసుకోవాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. అలా విశాఖ మేయర్ పీఠం తమకు కావాలని కోరనుంది. అయితే కూటమిలోని టీడీపీ, జనసేన ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.
Andhra Pradesh BJP
AP Local Elections
Local Body Elections
TDP
Jana Sena
NDA Alliance
Visakhapatnam Mayor
Mayor Elections
AP Politics
BJP in Andhra Pradesh
టీడీపీ జనసేన బీజేపీ కూటమి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
రాజకీయ వార్తలు
తాజా ఏపీ వార్తలు
తెలుగు వార్తలు
Scroll for the next article