Politics3rd Jan 12:21 PMSunil Byrisetty1 min read

అసోంలో బీజేపీ హ్యాట్రిక్‌?

అసోం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్ సాధిస్తుందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ సర్వే వెల్లడించింది. 126 స్థానాలు ఉన్న శాసనసభలో బీజేపీ 69-74 సీట

అసోంలో బీజేపీ హ్యాట్రిక్‌?
అసోం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్ సాధిస్తుందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ సర్వే వెల్లడించింది. 126 స్థానాలు ఉన్న శాసనసభలో బీజేపీ 69-74 సీట్లు గెలుచుకొని మెజారిటీ సాధించే అవకాశముందని పేర్కొంది. ఎన్‌డీఏ భాగస్వాములతో కలిపితే మొత్తం సీట్లు 90 మార్క్‌ను తాకే అవకాశం ఉందని తేలింది. వ్యూహాత్మక పొత్తులు, సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల మద్దతుతో అసోంలో బీజేపీ పట్టు కొనసాగుతోంది. పీపుల్స్‌ పల్స్‌ ట్రాకర్‌ పోల్‌ అంచనా ప్రకారం బీజేపీ 69-74 సీట్లతో అగ్రస్థానంలో నిలవనుంది. కాంగ్రెస్‌కు 25-29 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఎన్‌డీఏ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్‌ (ఏజీపీ)కు 8-11 సీట్లు, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌)కు 8-10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. చిన్న పార్టీలు చాలా వెనుకంజలో ఉన్నాయి. ఏఐయుడీఎఫ్‌ 0-2, యూపీపీఎల్‌ 0-2, రైజర్‌ దళ్‌ 1-2, అస్సాం జాతీయ పరిషత్‌ (ఏజేపీ) 0-1, సీపీఐ(ఎం) 0-1, స్వతంత్రులు/ఇతరులు 0-1 గెలిచే అవకాశం ఉంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 64 సీట్ల మెజారిటీకి ఎన్‌డీఏ చాలా ఆధిక్యంలో నిలుస్తోంది. దీంతో ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ మూడోసారి ఏకపక్షంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
Assam Elections
BJP
NDA
People’s Pulse Survey
Assam Assembly Polls
Congress
AGP
BPF
Indian Politics
Election Survey
రాజకీయ సర్వే
అసోం రాజకీయాలు
Scroll for the next article