News10th Jan 04:53 PMSunil Byrisetty1 min read
కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మాధవ్
విజయవాడ సత్యన్నారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమనాధ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా ఓంకార మంత్ర
విజయవాడ సత్యన్నారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమనాధ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా ఓంకార మంత్రాన్ని జపించారు. మాధవ్ మాట్లాడుతూ
ఈ దేశంలో సోమనాధ ఆలయంపై మొదటి దాడి జరిగిందని, భారత దేశంపై, సనాతన ధర్మంపై జరిగిన దాడి అని వివరించారు. నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా అన్ని శివాలయాల్లో ఓంకార్ నాదం పలకడం జరుగుతుందన్నారు. దుష్ట ఆలోచనతో సోమనాధ్ ఆలయంపై మహమ్మద్ ఘోరి, గజినీ యాత్ర జరిగిందని గుర్తు చేశారు.
రేపు నరేంద్ర మోదీ సోమనాధ స్వాభిమన పర్వ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఒక గొప్ప సంకల్ప కార్యక్రమంగా మారబోతుందని మాధవ్ పేర్కొన్నారు.