Politics4th Jul 06:03 PMSunil Byrisetty1 min read

బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో ఎంపీ పురంధేశ్వరి!

బీజేపీ చరిత్రలో తొలిసారి జాతీయ అధ్యక్ష పదవి మహిళను వరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ నేతల సమావేశంలో ఆయా మహిళల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో ఎంపీ పురంధేశ్వరి!
బీజేపీ చరిత్రలో తొలిసారి జాతీయ అధ్యక్ష పదవి మహిళను వరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ నేతల సమావేశంలో ఆయా మహిళల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేరు కూడా ఖరారయ్యే జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో నిర్మలా సీతారామన్‌తో పాటు పురందేశ్వరి వనతి శ్రీనివాసన్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు అవకాశం ఇస్తే బాగుంటుందని బీజేపీలో కొందరు నేతల మాట. ఈ క్రమంలో ఈసారి ఎవరిని బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
India news
delhi
BJP Next National President
Nirmala Sitharaman
Purandeswari
Vanthi Srinivasan
BJP FEMALE PRESIDENT RACE
బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చే అవకాశం
Scroll for the next article