National28th Oct 01:04 PMSunil Byrisetty1 min read
కర్ణాటకలో ఎన్డీయే క్లీన్ స్వీప్!
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. శాసన మండలిలోని 4 ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో బీజేపీ-జేడీఎస్ కూటమి క్లీన్ స్వీప్ సాధించింది. బెంగళూరు టీచర్స్ స్థాన
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. శాసన మండలిలోని 4 ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో బీజేపీ-జేడీఎస్ కూటమి క్లీన్ స్వీప్ సాధించింది. బెంగళూరు టీచర్స్ స్థానంలో ఐదుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ పుట్టన్నపై ఎన్డీయే అభ్యర్థి ఏపీ రంగనాథ్ 908 ఓట్ల తేడాతో గెలుపొందారు. పశ్చిమ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి ఎస్వీ సంకనూర్ భారీ ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు. హోరాహోరీగా సాగిన 4 ఎమ్మెల్సీ స్థానాల పోరులో ప్రతిపక్ష బీజేపీ-జేడీఎస్ కూటమి ప్రభంజనం సృష్టించింది. విద్యావంతులు, ఉపాధ్యాయులు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.