National28th Oct 02:00 PMSunil Byrisetty1 min read
పహల్గాం దాడి తర్వాత తొలిసారి పాక్‌కు భారత్ ఆహ్వానం!
నవంబర్ 20 నుంచి 22 వరకు ఢిల్లీలో ఎస్‌సీఓ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు పహల్గాం దాడి తర్వాత తొలిసారి పాక్‌కు భారత్ ఆహ్వానం అందింది. పాకిస్థాన్ సాంస్కృతిక మంత్రి ఔరంగజేబ్ ఖాన్‌కు ఆహ్వా
నవంబర్ 20 నుంచి 22 వరకు ఢిల్లీలో ఎస్‌సీఓ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు పహల్గాం దాడి తర్వాత తొలిసారి పాక్‌కు భారత్ ఆహ్వానం అందింది. పాకిస్థాన్ సాంస్కృతిక మంత్రి ఔరంగజేబ్ ఖాన్‌కు ఆహ్వానం లభించింది.
సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్‌ను తొలిసారి భారత్ నిర్వహిస్తోంది. అందుకోసం పది ఎస్‌సీఓ సభ్య దేశాలకు భారత్ ఆహ్వానం పంపింది. భారత్-పాక్ సంబంధాల ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. సాంస్కృతిక సంబంధాల బలోపేతమే ఎస్‌సీఓ సదస్సు లక్ష్యంగా జరగనుంది.