News21st Aug 11:03 AMSunil Byrisetty1 min read
గిరిజన ప్రాంతాల అభివృద్ధే బీజేపీ ధ్యేయం
గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. సారథ్యం యాత్రలో భాగంగా పాడేరు జిల్లాలో మాధవ్ పర్యటన కొనసాగుతోం
గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. సారథ్యం యాత్రలో భాగంగా పాడేరు జిల్లాలో మాధవ్ పర్యటన కొనసాగుతోంది.ఈ సందర్భంగా పాడేరు లో నిర్వహించిన ఛాయ్ పే చర్చలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. స్థానికులు ద్వారా గిరిజన ప్రాంతాల సమస్యలు మాధవ్ అడిగి తెలుసుకున్నారు. మాధవ్ మాట్లాడుతూ దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోదీ అనేక పధకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. గిరిజన ఉత్పత్తులకు స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటే ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని మాధవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి పాడేరు, చింతూరు, అరకు మీదుగా విజయనగరం జాతీయ రహదారికి అనుసంధానంగా మాడుగుల, నర్సీపట్నం ఘాట్ రోడ్డు నిర్మాణం ద్వారా రవాణా సదుపాయాలు మెరుగు పడతాయని మాధవ్ అన్నారు.