News28th Aug 04:08 PMSunil Byrisetty1 min read
పుదుచ్చేరిలోని BJP ‘సేవా సంకల్ప అభియాన్’
పుదుచ్చేరిలోని BJP రాష్ట్ర కార్యాలయంలో ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన రాష్ట్ర, జిల్లా కమిటీ వర్క్‌షాప్‌లో ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. స
పుదుచ్చేరిలోని BJP రాష్ట్ర కార్యాలయంలో ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన రాష్ట్ర, జిల్లా కమిటీ వర్క్‌షాప్‌లో ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం, సమాజంలోని ప్రతి వర్గానికి సేవలను చేరువ చేయడంపై వర్క్‌షాప్‌లో చర్చించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవా సంకల్ప స్ఫూర్తితో, ప్రజాసేవను మరింత విస్తృతం చేస్తూ, దేశ ప్రగతి–ప్రజా సంక్షేమం కోసం కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవడంపై దిశానిర్దేశం చేశారు.
సేవా సంకల్పం… ప్రజా సంక్షేమమే లక్ష్యం అని నినదించారు.