News9th Jan 09:14 AMSunil Byrisetty1 min read
అరని మంటలు.. ఓఎన్జీసీ ప్రయత్నాలు!
కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద ఓఎన్‌జీసీ చమురు బావిలో మంటలు ఇంకా ఆరలేదు. బావిలో సంభవించిన 'బ్లోఅవుట్' ఘటన స్థానిక ప్రజలను ఇంకా భయాందోళనకు గురిచేస్తూనే ఉంది. ఈ నెల 5న ప్రారంభమైన ఈ అగ్న
కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద ఓఎన్‌జీసీ చమురు బావిలో మంటలు ఇంకా ఆరలేదు. బావిలో సంభవించిన 'బ్లోఅవుట్' ఘటన స్థానిక ప్రజలను ఇంకా భయాందోళనకు గురిచేస్తూనే ఉంది. ఈ నెల 5న ప్రారంభమైన ఈ అగ్ని ప్రమాదం నేటికీ అదుపులోకి రాలేదు. బావి నుండి అగ్నికీలలు ఎగసి పడుతూనే ఉన్నాయి.
అయితే, ప్రారంభంలో ఉన్న మంటల ఉద్ధృతి కొంత మేర తగ్గడం ఊరట కలిగించే అంశం. రంగంలోకి దిగిన ఓఎన్‌జీసీ నిపుణు లు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి కేవలం 10 మీటర్ల దూరం వరకు వెళ్లి నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా యంత్రాల ద్వారా నీటిని జిమ్ముతున్నారు. దీంతో మంటల తీవ్రత తగ్గింది, కానీ పూర్తిగా ఆరలేదు.
బావిని శాశ్వతంగా మూసివేసేందుకు విదేశీ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.