Health2nd Oct 05:19 PMSunil Byrisetty1 min read
రక్తదానం.. ప్రాణదానంతో సమానం
సమాజంలో ప్రతివక్కరు స్వపయోజనం తో పాటు సమాజ శ్రేయస్సు కొరకు ఆలోచించాలని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్
సమాజంలో ప్రతివక్కరు స్వపయోజనం తో పాటు సమాజ శ్రేయస్సు కొరకు ఆలోచించాలని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పేపర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో విజయవాడ ఏపీ ఎన్జీజీవోస్ హోమ్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని విద్యాసాగర్ ప్రాంభించారు.ఈ సందర్భంగా గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా సమాజానికి విలువైన సేవ అందించవచ్చని అన్నారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవాలు, తలసేమియా వంటి పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గాంధీజీ సేవా స్ఫూర్తి, లాల్‌బహదూర్ శాస్త్రి కర్తవ్యనిష్ఠను ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులు, యువత, వ్యాపార వర్గాలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఒకరి రక్తదానం మరొకరి జీవితాన్ని నిలబెట్టే మహత్తర సేవ అని పేర్కొన్నారు.