Politics26th Oct 01:05 PMSunil Byrisetty1 min read

‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరం

తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. పక్క రాష్ట్రంలో ఒక గురుకుల పాఠశాలలో 2023

‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరం
తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. పక్క రాష్ట్రంలో ఒక గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితికి సంబంధించిన ఒక వీడియోను తాజాగా అరకులో జరిగినట్లు ఒక కథనం రాసి వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే వార్తపై, ఇదే వీడియోపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ‘ఫ్యాక్ట్ చెక్’ లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించామని చెప్పారు. అయినా కొద్ది రోజులు ఊరుకుని మళ్లీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తరచూ నేరాలకు పాల్పడేవారిని ‘హ్యాబిట్యువల్ అఫెండర్స్’ అంటారన్నారు. అందుకే అది ఒక రాజకీయ పార్టీనా హ్యాబిట్యువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు. బ్లూ బ్యాచ్ చేసే ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎవరూ కూడా నమ్మవద్దని మంత్రి నారా లోకేష్ కోరారు.
Andhra Pradesh Politics
Nara Lokesh
Blue Batch
Fake Propaganda
Social Media Misinformation
YSRCP Supporters
Araku Incident
Fact Check
హ్యాబిట్యువల్ అఫెండర్స్
తెలుగుదేశం పార్టీ
మంత్రి లోకేష్ వ్యాఖ్యలు
Scroll for the next article