News6th Nov 11:45 AMSunil Byrisetty1 min read

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

తమిళనాడు మత్స్యకారుల బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల బోటు ప్రమాదంలో చిక్కుకుని పలువురు మృత్యువాతపడడం దురదృష్టకమన

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి
తమిళనాడు మత్స్యకారుల బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల బోటు ప్రమాదంలో చిక్కుకుని పలువురు మృత్యువాతపడడం దురదృష్టకమని సీఎం అన్నారు. మురసు తుపాను ప్రభావంతో సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం ఆవేదన కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు బోటు ప్రమాదం... గల్లంతైన వారి కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. పలువురు మత్స్యకారులు మరణించిన స్థితిలో ఉండగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరానికి బోటు కొట్టుకు వచ్చిందని అధికారులు చెప్పారు. ఈ బోటులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో ఏడుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతు అయ్యారని తెలిపారు. మత్స్యకారుల మృతదేహాలను గుర్తించి సహయక చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.
Scroll for the next article