News11th Jul 04:29 PMSunil Byrisetty1 min read
వియత్నాంలో పడవ బోల్తా.. ఏపీవాసులు మృతి
వియత్నాం పర్యటనలో బోటు తల్లకిందులు కావడంతో పలువురు భారతీయులు మరణించారు. ఫూక్వాక్ ద్వీపం సమీపంలో స్పీడ్ బోటు బోల్తా పడి 15 మంది భారత టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏపీలో
వియత్నాం పర్యటనలో బోటు తల్లకిందులు కావడంతో పలువురు భారతీయులు మరణించారు. ఫూక్వాక్ ద్వీపం సమీపంలో స్పీడ్ బోటు బోల్తా పడి 15 మంది భారత టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏపీలోని కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ మరణించారు. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ఒడ్డున ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. మరొకరు బందరు వాసి గెల్లి కిశోర్‌కు తీవ్ర అస్వస్థతకుగురై పరిస్థితి విషమంగా ఉంది. ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్లను కుటుంబాలను వియత్నాం ట్రిప్‌కు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. వీరిలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. ట్రిప్‌లో భాగంగా పడవల్లో సముద్రంలో విహార యాత్రకు వెళ్లగా ప్రమాదం చోటు చేసుకుంది. బాధితుల సమాచారం కోసం కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్లు +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414
వియత్నాం: హనోయ్ కంట్రోల్ రూమ్ నెంబర్ +84 91 308 9165