Politics14th Mar 06:49 PMSunil Byrisetty1 min read

వెంక‌న్న‌కు విన్న‌విద్దాం.. రండి..!

తిరుమలలో జరుగుతున్న అపచారాలు అవినీతిపై ఎన్ని పోరాటాలు, నిరసనలు చేసినా టీటీడీ, ప్రభుత్వం స్పందించనందువల్ల ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నామని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచ

వెంక‌న్న‌కు విన్న‌విద్దాం.. రండి..!
తిరుమలలో జరుగుతున్న అపచారాలు అవినీతిపై ఎన్ని పోరాటాలు, నిరసనలు చేసినా టీటీడీ, ప్రభుత్వం స్పందించనందువల్ల ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నామని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ తెలిపారు. తిరుమల పవిత్రత, పరిరక్షణ లక్ష్యంగా స్వామీజీలు, భక్తులతో కలిసి ఈనెల 17 న (సోమవారం) ఉదయం 8 గంటలకు అలిపిరి నుండి మెట్లమార్గంలో తిరుమల చేరుకొని తిరుమల సమస్యలు, ప్రక్షాళనపై ప్రతిఒక్కరు నేరుగా స్వామివారికి వినతిపత్రం సమర్పించే పవిత్రమైన కార్యక్రమంలో ప్రతిఒక్కరు పాల్గొని టీటీడీకి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే కార్యక్రమంలో భాగమవ్వాలని ఆయన కోరారు. తిరుమ‌ల‌లో పాప ప్ర‌క్షాళ‌న‌తో పాటు భ‌క్తుల మ‌నోభావాలను ప‌రిర‌క్షించడం.. స్వామి ప‌విత్ర‌త‌ కాపాడడం కోసం.. ఆ మహత్తర బాధ్య‌త ఆ స్వామికే విన్న‌వించాల‌న్న డిమాండ్‌తో బీసీవై జాతీయ అధ్య‌క్షులు బోడే రామ‌చంద్ర యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 17 అలిపిరి నుంచి తిరుమ‌ల వ‌ర‌కు మ‌హా పాద‌యాత్ర‌కు ఆయ‌న శ్రీకారం చుట్టారు. సోమ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు అలిపిరి నుంచి మొద‌ల‌య్యే ఈ పాద‌యాత్ర తిరుమ‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంది. రామ‌చంద్ర యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో స్వామీజీలు, వేలాది మంది భ‌క్తులు ఈ మ‌హా పాద‌యాత్ర‌లో పాల్గొంటారు. పాద‌యాత్ర త‌ర్వాత స్వామికి వినతిప‌త్రం అందించే మ‌హాత్త‌ర కార్య‌క్ర‌మం ఉంటుంది.
Ramachandra Yadav
TTD
Bharatha Chaitanya Yuvajana party
రామచంద్ర యాదవ్
భరత చైతన్య యువజన పార్టీ
Scroll for the next article