News3rd Oct 02:31 PMSunil Byrisetty1 min read
బాయిలర్ పేలి నలుగురి మృతి.. సీఎం, లోకేశ్ దిగ్భ్రాంతి
తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు కార్మికులు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయ
తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు కార్మికులు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు పేలుడు ఘటనలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. బాయిలర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు.