News3rd Oct 05:13 PMSunil Byrisetty1 min read
తిరుపతిలో బాంబు బెదిరింపులు
తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 4 ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ ఈ-మెయిల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతిలో బాంబ్‌స్క్వాడ్ ముమ్మర తనిఖీలు
తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 4 ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ ఈ-మెయిల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతిలో బాంబ్‌స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. తిరుపతి బస్టాండ్, ఆలయాల్లో పోలీసుల తనిఖీలు చేశారు. శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం ఆలయం.. గోవిందరాజస్వామి ఆలయ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అలాగే జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణంలో జల్లెడ పట్టారు. ఈ నెల 6న సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా.. అగ్రికల్చర్ కాలేజ్ హెలిప్యాడ్ దగ్గర తనిఖీలు నిర్వహించారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లోనూ సోదాలు చేపట్టారు.