News24th Jun 05:12 PMSunil Byrisetty1 min read
శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం
శ్రీశైలంలో దీపావళి బాంబులు, గన్ బుల్లెట్స్ కలకలం రేపాయి. శ్రీశైలం వాసవి సత్రం ఎదురు రోడ్డు డివైడర్ పైన 9 పెద్ద సైజు బుల్లెట్స్, నాలుగు చిన్న సైజు లభ్యమయ్యాయి. రోడ్డు డివైడర్ మధ్యలో
శ్రీశైలంలో దీపావళి బాంబులు, గన్ బుల్లెట్స్ కలకలం రేపాయి. శ్రీశైలం వాసవి సత్రం ఎదురు రోడ్డు డివైడర్ పైన 9 పెద్ద సైజు బుల్లెట్స్, నాలుగు చిన్న సైజు లభ్యమయ్యాయి. రోడ్డు డివైడర్ మధ్యలో బుల్లెట్స్ సంచిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడే ఉన్న కూలీ పని చేసే వారు సంచిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బందోబస్తు విధులు నిర్వర్తించే ఏ.ఆర్, బాంబ్ స్క్వాడ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సంచిలోని బుల్లెట్లను తనిఖీ చేశారు. అందులో 303కి చెందిన 6 బుల్లెట్లు, SLRకు చెందిన ఐదు బుల్లెట్లు, SLRకు చెందిన నాలుగు ఖాళీ బుల్లెట్లు, 9MMకు చెందిన 4 బుల్లెట్లు గుర్తించారు. అయితే ఈ బుల్లెట్స్ శ్రీశైలం ఏఆర్ కానిస్టేబుల్స్‌కి సంబంధించినవని ఆత్మకూరు DSP రామాంజినాయక్ తెలిపారు. వాసవీ సత్రం దగ్గర భోజనానికి వెళ్లి బుల్లెట్లను మరచిపోయినట్లు విచారణలో గుర్తించారు.