Politics17th Oct 12:18 PMSunil Byrisetty1 min read

నామినేషన్ల రోజే వైసీపీ అరాచకాలు

2020 స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే, వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు, హత్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పుంగనూరులో అల్లర్లే అందుకు నిదర్శనమన్నారు. పుంగనూర

నామినేషన్ల రోజే వైసీపీ అరాచకాలు
2020 స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే, వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు, హత్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పుంగనూరులో అల్లర్లే అందుకు నిదర్శనమన్నారు. పుంగనూరులో నామినేషన్ల రోజున వైసిపీ ఎంపి మిథున్ రెడ్డి వర్గం అరాచకాలు చేసిందన్నారు. రౌడీలను, ఆయుధాలతో కూడిన కాన్వాయ్‌ను ఉపయోగించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని మండిపడ్డారు. నామినేషన్లు దాకలు సమయంలో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నలుగురికి మించి ఉండకూడదన్నారు. నిబంధనలు తుంగలో తొక్కి రౌడీ జనాలను, ఆయుధాలు, మందు బాటిల్స్, కత్తులను కాన్వాయ్‌లో మిథున్ రెడ్డి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు, వీడియో లు కూడా మీడియాలో వచ్చాయని ఉమా అన్నారు.
Scroll for the next article