Politics27th Jul 10:43 AMSunil Byrisetty1 min read

పార్టీ క్రమశిక్షణ ఎక్కడా తప్పలేదన్న బోండా ఉమా

టీడీపీ అధిష్ఠానం వివరణ కోరడంపై ఎమ్మెల్యే బోండా ఉమ స్పందించారు. టీడీపీ అధిష్ఠానం వివరణ అడిగితే ఇస్తానని, తానేమీ వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని పేర్కొన్నారు. జనసేన మాజీ నేత దాసరి

పార్టీ క్రమశిక్షణ ఎక్కడా తప్పలేదన్న బోండా ఉమా
టీడీపీ అధిష్ఠానం వివరణ కోరడంపై ఎమ్మెల్యే బోండా ఉమ స్పందించారు. టీడీపీ అధిష్ఠానం వివరణ అడిగితే ఇస్తానని, తానేమీ వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని పేర్కొన్నారు. జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యానని చెప్పారు. వైసీపీ నేత అంబటి కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించానని స్పష్టం చేశారు. ఇలా అయితే, వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా హాజరయ్యారు కదా అని ప్రశ్నించారు. వారిని కూడా వివరణ అడుగుతారా అనడిగారు. తాను పార్టీకి ఇబ్బందులు కలిగించే పని చేయలేదు, పార్టీ క్రమశిక్షణ ఎక్కడా తప్పలేదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.
Andhra Pradesh
AP Politics
Party Discipline
Bonda Uma Maheswara Rao
TDP
Telugu Desam Party
YSRCP
Ambati Rambabu
ముద్రగడ సంతాప సభ
జక్కంపూడి రాజా
జ్యోతుల నెహ్రూ
వంగవీటి రాధా
Scroll for the next article