TTD15th Jun 10:54 AMSunil Byrisetty1 min read
టీటీడీ టికెట్లా? వాట్సాప్‌లో చిటికెలో బుక్
తిరుమల తిరుపతి వెళ్లాలనుకునే భక్తులు టికెట్ల కోసం హైరానా పడక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ సర్కారు తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ లో టీటీడీ సేవలు కూడా ఉన్నాయి. ఇలా చేస్తే టికెట్లు బుక్ చేసుక
తిరుమల తిరుపతి వెళ్లాలనుకునే భక్తులు టికెట్ల కోసం హైరానా పడక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ సర్కారు తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ లో టీటీడీ సేవలు కూడా ఉన్నాయి. ఇలా చేస్తే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టీటీడీకి సంబంధించి 4 సేవలను వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తెచ్చారు. స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ సెంటర్స్ సమాచారంతో పాటు ప్రస్తుతం ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయి. సర్వ దర్శనం క్యూలైన్ ఏ మేరకు ఉంది. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు పడుతోంది. శ్రీవాణి టికెట్లకు సంబంధించిన సమాచారం భక్తులు తెలుసుకోవచ్చు. రూమ్స్ కోసం డిపాజిట్ రీఫండ్ వివరాల సమాచారం కూడా అందుకోవచ్చు.
9552300009 వాట్సాప్ నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకుని, ఆ నంబర్‌కు* *“జై శ్రీరామ్” మెసేజ్ పంపండి. ఆప్షన్ల నుంచి “ఆలయ బుకింగ్ సేవలు” ఎంచుకోండి. దర్శన టిక్కెట్లు, సేవా రిజర్వేషన్లు, వసతి, ఇతర సేవలను బుక్ చేసుకోవడానికి, స్లాటెడ్ సర్వదర్శనంతో పాటు సర్వ దర్శనం, శ్రీవాణి కౌంటర్ స్టేటస్ డిపాజిట్ రీఫండ్ లైవ్ స్టేటస్ ఆప్షన్లు ఉంటాయి. బుకింగ్ చేసి, డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.