Education29th Jan 11:49 AMSunil Byrisetty1 min read
ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన పుస్తకాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన ప్రచురణలను అందించేందుకు ఎమెస్కో సంస్థ ముందుకొచ్చింది. ఎమెస్కో విజయకుమార్ సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఈ విషయాన్ని తెలి
రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన ప్రచురణలను అందించేందుకు ఎమెస్కో సంస్థ ముందుకొచ్చింది. ఎమెస్కో విజయకుమార్ సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రంలోని గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన ప్రచురణలను విరాళంగా అందించేందుకు తమ సంస్థ పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లు విజయకుమార్ తెలిపారు. ఈమేరకు పుస్తకాల జాబితాను సీఎంకు అందించిన విజయకుమార్.. గ్రంథాలయాలకు ప్రచురణలు చేరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేలా ఆ సంస్థను ఆదేశించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమెస్కో విజయకుమార్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. గ్రంథాలయాలు సమాజంలో జ్ఞాన విస్తరణకు కీలక పాత్ర పోషిస్తున్నాయని, పుస్తకాలు పంచడం అంటే జ్ఞానాన్ని పంచినట్లేనని అన్నారు. ప్రచురణల వితరణ ద్వారా విద్యార్థులు, ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం అన్నారు.