Politics19th Sep 11:55 AMSunil Byrisetty1 min read

వైసీపీలో కీలకంగా బొత్స వారసురాలు

వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డా. బొత్స అనూష క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జగన్ ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త

వైసీపీలో కీలకంగా బొత్స వారసురాలు
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డా. బొత్స అనూష క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జగన్ ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా నియమితులయ్యారు. భీమిలిలో స్థానిక నాయకులను, కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆమెపై ఉండనుంది. రాజకీయాల్లోకి రాకముందు ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. అలాగే వైద్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తండ్రి బాటలోనే నడుస్తూ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో తాను చీపురుపల్లి నుంచే పోటీ చేస్తానని బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
Scroll for the next article