Politics31st May 01:29 PMSunil Byrisetty1 min read

3 రోజుల మహానాడు డ్రామా!

మూడు రోజులు కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు డ్రామా అని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏడాదిలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజలను మభ్యపెట్టారని ఎద్దేవా చేశారు. పెన్షన్‌

3 రోజుల మహానాడు డ్రామా!
మూడు రోజులు కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు డ్రామా అని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏడాదిలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజలను మభ్యపెట్టారని ఎద్దేవా చేశారు. పెన్షన్‌ పెంపు తప్ప ఏ హామీ అమలు చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. గతేడాది తల్లికి వందనం ఎగ్గొట్టారని వైసీపీ నేత బొత్స మండిపడ్డారు. టెన్త్ క్లాస్ వాల్యుయేషన్‌లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా ఉందన్నారు. 1650 మంది రీవాల్యుయేషన్‌ చేయించుకున్నారంటేనే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైందని, గతంలో 500మంది కంటే ఎక్కువ విద్యార్థులు.. రీవాల్యుయేషన్‌ చేయించుకున్న దాఖలాలు లేవని వైసీపీ నేత బొత్స పేర్కొన్నారు.
Andhra Pradesh news
YSRCP
botsa Sataya narayana
mahanadu
3 రోజుల మహానాడు డ్రామా
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
Scroll for the next article