News30th Jan 11:51 AMSunil Byrisetty1 min read

బొత్సకు కీలక పదవి.. వైసీపీలో నంబర్ 2గా?!

వైసీపీలో కీలక నేత బొత్స సత్యనారాయణకు పార్టీపరంగా పదవి దక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన్ను ప్రకటిస్తారని చర్చించుకుంటున్నారు. గణతంత్ర దినోత్సవం సం

బొత్సకు కీలక పదవి.. వైసీపీలో నంబర్ 2గా?!
వైసీపీలో కీలక నేత బొత్స సత్యనారాయణకు పార్టీపరంగా పదవి దక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన్ను ప్రకటిస్తారని చర్చించుకుంటున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో నిర్వహించిన ఎట్ హోంలో నారా లోకేష్‌తో బొత్స సత్యనారాయణ అత్యంత సన్నిహితంగా, సరదాగా ముచ్చటించారు. తన వారసుల రాజకీయ రంగ ప్రవేశం కోసం బొత్స కూటమి పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారానికి ఇది మరింత ఊతమిచ్చింది. ఇటీవల కేవలం ప్రెస్ మీట్‌లకే పరిమితమవుతూ, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పెద్దగా కష్టపడకపోవడం వెనుక ఆయన తదుపరి రాజకీయ అడుగుల గురించిన సంకేతాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన జగన్, ఆయనను బుజ్జగించడానికి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్డును వాడుతున్నట్లు కనిపిస్తోంది. బొత్స కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచారంపై పెద్దగా స్పందించడం లేదు.ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
Andhra Pradesh
Botsa Satyanarayana
YSR Congress Party
Working President
Key Appointment
Political Speculation
YS Jagan Mohan Reddy
రాజకీయ సమీకరణాలు
వారస రాజకీయాలు
పార్టీ అంతర్గత వ్యవహారాలు
politics
Scroll for the next article