Politics17th Mar 06:23 PMSunil Byrisetty1 min read

లేనిది ఉన్నట్లుగా... ఉన్నది లేనట్లుగా: సీఎం చంద్రబాబుపై బొత్స!

వైయస్ఆర్‌సీపీ పాలనపై బుదరచల్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన స్కాంలపై చర్చించాలంటూ

లేనిది ఉన్నట్లుగా... ఉన్నది లేనట్లుగా: సీఎం చంద్రబాబుపై బొత్స!
వైయస్ఆర్‌సీపీ పాలనపై బుదరచల్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన స్కాంలపై చర్చించాలంటూ అధికారపక్షం పట్టుబట్టడం వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు. అసలు విచారణే జరగకుండా కేవలం ఆరోపణలను స్కామ్‌లుగా చిత్రీకరించి వైయస్‌ఆర్‌సీపీ పాలనపై విషం చిమ్మేందుకు ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనిది ఉన్నట్లుగా... ఉన్నది లేనట్లుగా చిత్రీకరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అలాగే ఈ రోజు స్కామ్‌లపై చర్చ అంటూ మండలిలో అధికారపక్షం హంగామా చేసిందన్నారు. రాష్ట్ర విభజన తరువాత నుంచి ఇప్పటి వరకు అంటే 2014-24 వరకు జరిగిన స్కామ్‌లపై చర్చించాలని వైయస్‌ఆర్‌సీపీగా ప్రభుత్వాన్ని కోరామని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం వైయస్‌ఆర్‌సీపీ పాలన అంటే 2019-24 వరకు మాత్రమే చర్చకు సిద్దమని ప్రకటించిందని చెప్పారు. అసలు గత అయిదేళ్ళ పాలనలో జరిగిన వాటిపైన కూటమి ప్రభుత్వం ఈ పదినెలల్లో పలు ఆరోపణలు మాత్రమే చేసిందని విమర్శించారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు కూడా పూర్తి కాలేదు, నిరూపణ జరగలేదన్నారు. అటువంటప్పుడు వైయస్‌ఆర్‌సీపీ పాలనలో స్కామ్‌లు అంటూ మీరు చేసిన తప్పుడు ఆరోపణలపైన సభలో ఎలా చర్చిస్తారని అధికారపక్షాన్ని నిలదీశామని బొత్స అన్నారు.
Ysrcp
Andhra pradesh
బొత్స సత్యనారాయణ
Scroll for the next article