Politics23rd Sep 09:50 AMSunil Byrisetty1 min read
వైసీపీలో బొత్స వర్సెస్ జగన్?
అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీలోని విభేదాలు బయటపడుతున్నాయి. వైఎస్ఆర్‌సీపీ పెద్దల్లో బొత్స సత్యనారాయణ వ్యవహారశైలిపై అసంతృప్తి పెరుగుతోంది. ఆయన తీరు జగన్ ను ఇబ్బంది పెట్టేలా ఉందని అంటున
అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీలోని విభేదాలు బయటపడుతున్నాయి.
వైఎస్ఆర్‌సీపీ పెద్దల్లో బొత్స సత్యనారాయణ వ్యవహారశైలిపై అసంతృప్తి పెరుగుతోంది. ఆయన తీరు జగన్ ను ఇబ్బంది పెట్టేలా ఉందని అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా జగన్ కు సమస్యలు సృష్టించేందుకు బొత్స కుట్ర చేస్తున్నారని అనుమానిస్తున్నారు. శాసనమండలిలో జరుగుతున్న పరిణామాలే దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ సంస్కరణల విషయంలో జగన్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. కానీ బొత్స మండలిలో జీఎస్టీ అమలు విషయంలో కేంద్రాన్ని ప్రశంసిస్తూ చేస్తున్న తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించారు. బీఏసీ సమావేశంలో ఈ విషయం ఆయన చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సభలో ఆయన వ్యతిరేకిస్తారని అనుకున్నారు. కానీ ఆయన వ్యతిరేకించబోతున్నారని తెలిసి.. పై నుంచి ఒత్తిడి రావడంతో.. వ్యతిరేకించలేదు. అలాగని.. సమర్థించలేదు. దీంతో మండలి చైర్మన్ పాస్ అయినట్లుగా ప్రకటించారు.