Politics24th Aug 04:00 PMSunil Byrisetty1 min read

జనసేనలోకి బొత్స వారసురాలు?

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తన రాజకీయ వారసురాలిగా కుమార్తె డా. అనూషను ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పీఠమే లక్ష్యంగా ఆమెను బ

జనసేనలోకి బొత్స వారసురాలు?
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తన రాజకీయ వారసురాలిగా కుమార్తె డా. అనూషను ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పీఠమే లక్ష్యంగా ఆమెను బరిలోకి దింపబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి మద్దతుగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతోపాటు, స్థానికంగా ప్రజలను కలుస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నారు. అయితే జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆమె పోటీని ప్రకటించిన సమయంలో సమయంలో పార్టీ గుర్తు, వైఎస్సార్సీపీ ప్రస్తావన చేయకపోవడంతో ఆమె జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనసేన అగ్రనేతలతో ఆమె సంప్రదింపులు జరుపుతున్నారని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీని కాదనుకోరని కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
Andhra Pradesh Politics
Botsa Satyanarayana
Anusha
Botsa’s Daughter
Jana Sena
YSRCP
Vizianagaram
ZP Chairperson
Local Body Elections
ఉత్తరాంధ్ర రాజకీయాలు
రాజకీయ వారసత్వం
జనసేన పార్టీ
వైసీపీ ఎమ్మెల్సీ
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article