Health9th Mar 11:17 AMSunil Byrisetty1 min read

కోనసీమ బీపీ.. కృష్ణాకు షుగర్!

వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎన్‌సీడీ సర్వే-3లో నివ్వెరపోయే అంశాలు వెలుగు చూశాయి. కోస్తా జిల్లాల ప్రజల్లో ఎక్కువ మందిలో రక్తపోటు(బీపీ), మధుమేహం(డయాబెటిస్) ఉన్నట్

కోనసీమ బీపీ.. కృష్ణాకు షుగర్!
వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎన్‌సీడీ సర్వే-3లో నివ్వెరపోయే అంశాలు వెలుగు చూశాయి. కోస్తా జిల్లాల ప్రజల్లో ఎక్కువ మందిలో రక్తపోటు(బీపీ), మధుమేహం(డయాబెటిస్) ఉన్నట్లు గుర్తించారు. సర్వే-2లో గుర్తించిన వారితో కలిపి రాష్ట్రంలో 14.73% మందికి రక్తపోటు, 11.78% మందికి మధుమేహం ఉన్నట్లు తేలింది. రక్తపోటులో కోనసీమ జిల్లా, మధుమేహంలో కృష్ణా జిల్లా ముందు వరుసలో ఉన్నాయి. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారు 4.09 కోట్ల మంది ఉండగా మూడో సర్వేలో ఇప్పటి వరకు 1.34 కోట్ల మంది వివరాలు సేకరించారు. కోస్తా జిల్లాలు మధుమేహం, బీపీలో ముందుండగా.. గిరిజనులు ఎక్కువగా ఉండే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలు జాబితాలో చివరిలో ఉన్నాయి
kostha Jilla
Diabetes
BP
Health
బీపీ
డయాబెటిస్
కోస్తా జిల్లా
Scroll for the next article