TTD3rd Oct 05:17 PMSunil Byrisetty1 min read
భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమల అన్న
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈవో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు రెండవసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం తన అదృష్టం అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నారన్నారు. భక్తులకు టిటిడి అందించిన అన్న ప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.