News30th Mar 11:33 AMSunil Byrisetty1 min read
బీఎస్ఎన్ఎల్ 5జీ వచ్చేస్తోంది
భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. జూన్ నుంచి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందిస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రకటి
భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.
జూన్ నుంచి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందిస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రకటించారు.
ఈ సేవలు ముందుగా ఢిల్లీలో ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. తర్వాత పలు నగరాలకు సేవలను విస్తరించనున్నారు.
5జీ అందుబాటులోకి వస్తే వినియోగదారులకు మరింత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లభిస్తుందని వెల్లడించారు.
5జీ సేవలు అందుబాటులోకి వస్తే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో బీఎస్ఎన్ఎల్ పోటీ పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది జూలైలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచడంతో చాలామంది BSNL నెట్‌వర్క్‌కి మారారు.
5జీ అందుబాటులోకి వస్తే యూజర్ల సంఖ్య మరింత పెరుగుతుంది.
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది.
రూ. 1499 ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, 24GB డేటాను అందిస్తుంది.
ఈ ఆఫర్ అంతకు ముందు 336 రోజులకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు మొత్తం 365 రోజులకు ప్లాన్ వర్తించనుంది.