Education19th Aug 11:33 AMSunil Byrisetty1 min read

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలు ప్రారంభం

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ దూరవిద్య కోర్సులలో ప్రవేశాలను ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ అధ్

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలు ప్రారంభం
డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ దూరవిద్య కోర్సులలో ప్రవేశాలను ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ అధ్యయన కేంద్రాల్లో డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరoలో దూరవిద్య విధానంలో బీఏ, బీకామ్ , బీఎస్సి, బీ.ఎల్.ఎ.ఎస్.ఈ తో పాటు అనేక ప్రోగ్రాములు తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమంలో అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ ప్రవేశాలు కోరుకొనే అభ్యర్థులు ఈకోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు అర్హులు. మరిన్ని వివరాలకు 7382929602, 9030102653 నంబర్లకు సంప్రదించాలి.
Andhra Pradesh
BRAOU
Dr BR Ambedkar Open University
Admissions 2026-27
Distance Education
Undergraduate Courses
BA
BCom
BSc
BLAS
Telugu Medium
English Medium
Higher Education
Online Admissions
Scroll for the next article