News21st Nov 09:37 AMSunil Byrisetty1 min read
నాగార్జున సాగర్ కుడి కాలువకు గండి
నాగార్జున సాగర్ కుడికాలువ గండి పడినట్లు సమాచారం అందుతోంది. దీనిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులను రాత్రికి రాత్రికి అప్రమత్తం చేశారు. అధికారులు యుధ్దప్రాతి
నాగార్జున సాగర్ కుడికాలువ గండి పడినట్లు సమాచారం అందుతోంది. దీనిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులను రాత్రికి రాత్రికి అప్రమత్తం చేశారు. అధికారులు యుధ్దప్రాతిపదికన గండి పూడ్చే పనులు చేపట్టారు. గ్రామస్దులు ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. మధ్యాహ్నానికి గండి పూడ్చివేత పూర్తి చేస్తామని చెబుతున్నారు. అలాగే సమీప గ్రామాల్లోకి నీరు వెళ్ళకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గండి పడటానికి గల కారణాలను నివేదిక రూపంలో అందించాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి నిమ్మల కోరారు.