Health3rd Aug 06:04 PMSunil Byrisetty1 min read

తల్లిపాలే శిశువు జీవితానికి అమృతధార..

తల్లిపాలే శిశువు ఆరోగ్య‌క‌ర జీవితానికి అమృతధార అని.. మొదటి ఆరు నెలల వరకు వాటిని మాత్రమే అందించడం ద్వారా శిశువుకు సంపూర్ణ పోషకాహారం, మెరుగైన రోగనిరోధక శక్తి లభిస్తాయ‌ని ఎన్టీఆర్ జిల

తల్లిపాలే శిశువు జీవితానికి అమృతధార..
తల్లిపాలే శిశువు ఆరోగ్య‌క‌ర జీవితానికి అమృతధార అని.. మొదటి ఆరు నెలల వరకు వాటిని మాత్రమే అందించడం ద్వారా శిశువుకు సంపూర్ణ పోషకాహారం, మెరుగైన రోగనిరోధక శక్తి లభిస్తాయ‌ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఆరోగ్యకరమైన ఎదుగుదల, మానసిక వికాసానికి తల్లిపాలు ప్రకృతి ప్రసాదించిన అమూల్య వరమని పేర్కొన్నారు. ప్ర‌పంచ తల్లిపాల వారోత్సవాలు సంద‌ర్భంగా ఆయన గోడ పత్రికను, పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. జీవితంలో సుస్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలు.. ఇతివృత్తంతో త‌ల్లిపాల వారోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ త‌ర్వాత మాత్రమే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాల‌న్నారు. పుట్టిన గంట‌లోపే త‌ల్లిపాలు ఇవ్వ‌డాన్ని ప్రారంభించాల‌ని.. గోల్డెన్ అవర్‌లో వాటిని ఇవ్వ‌డం వ‌ల్ల శిశువుల ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని.. వ్యాధి నిరోధక శక్తి, పెరుగుతుందని పేర్కొన్నారు.
Public Health
Breastfeeding
World Breastfeeding Week
NTR District
Collector G Lakshmisha
Infant Health
Child Nutrition
Exclusive Breastfeeding
Immunity
Maternal Health
Scroll for the next article