International13th Sep 02:16 PMSunil Byrisetty1 min read

దేశీయ కరెన్సీల్లోనే వాణిజ్యం

డాలర్ ఆధిపత్య ప్రభావాన్ని తగ్గించే దిశగా బ్రిక్స్ దేశాలు కీలక అడుగు వేశాయి. కూటమి దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లోకల్ కరెన్సీల్లో నిర్వహించేలా ప్రోత్సహించాలని తీర్మానించాయి.

దేశీయ కరెన్సీల్లోనే వాణిజ్యం
డాలర్ ఆధిపత్య ప్రభావాన్ని తగ్గించే దిశగా బ్రిక్స్ దేశాలు కీలక అడుగు వేశాయి. కూటమి దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లోకల్ కరెన్సీల్లో నిర్వహించేలా ప్రోత్సహించాలని తీర్మానించాయి. సులభతర వాణిజ్యం కోసం క్రాస్ బార్డర్ చెల్లింపుల వ్యవస్థల అనుసంధానంపై అధ్యయనం చేయాలని తీర్మానించాయి. బ్రిక్స్ పేమెంట్ టాస్క్ ఫోర్స్ ద్వారా సభ్య దేశాల బ్యాంకింగ్, మెసేజింగ్ నెట్వర్క్ పరస్పరం కలిసి పనిచేసేలా ఏర్పాట్లను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాలన్ని ఏకాభిప్రాయంతో 'న్యూఢిల్లీ డిక్లరేషన్'ను ఆమోదించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సహా సభ్యదేశాల అధినేతల సమక్షంలో జరిగిన ఈ సదస్సులో గ్లోబల్ సౌత్ దేశాల గళాన్ని కూటమి బలంగా వినిపించింది. కాగా, విభేదాలు పక్కన పెట్టి ఇరాన్ సహా యూఏఈ, సౌదీ అరేబియా ఈ డిక్లరేషన్కు ఆమోదం తెలిపాయి.
International Trade
BRICS Summit
New Delhi Declaration
Local Currency Trade
De-Dollarisation
BRICS Payments
Cross Border Payments
BRICS Payment Task Force
US Dollar
Scroll for the next article