News1st Nov 04:38 PMSunil Byrisetty1 min read
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వారోత్సవాలు
ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ హిత జీవన విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 7వ తేదీ
ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ హిత జీవన విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 7వ తేదీ వరకు జరగనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా తొలిరోజు ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంస్థల్లో యోగా, నడక, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, ఆయుష్ వైద్య కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో యోగా, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించగా, విశాఖపట్నం కేజీహెచ్‌లో వైద్య సిబ్బంది పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. విమ్స్‌లోని వైద్య సిబ్బంది ఆసుపత్రి వార్డుల్లో ప్రతిజ్ఞ చేశారు. క్రిటికల్ కేర్ కేంద్రంలో యోగా, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు, కడప, పాడేరు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు హనుమాన్‌పేట, కాశిమికోట, రొక్కడిబండసత్రం పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వివిధ కార్యక్రమాలు చేపట్టారు.