Health30th Oct 04:42 PMSunil Byrisetty1 min read

వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జీవనశైలి వారోత్సవాల నిర్వ‌హ‌ణ‌

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు పర్యావరణ హిత జీవన విధానాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బ్రిక్స్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు నవంబర్‌ 1 నుంచి 7 వరకు ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల ద్వారా జరగను

వైద్య ఆరోగ్య శాఖ ద్వారా  జీవనశైలి వారోత్సవాల నిర్వ‌హ‌ణ‌
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు పర్యావరణ హిత జీవన విధానాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బ్రిక్స్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు నవంబర్‌ 1 నుంచి 7 వరకు ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల ద్వారా జరగనున్నాయి. ఈ క్ర‌మంలోనే వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, నీరు, విద్యుత్తు పొదుపు, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గింపు, ఆసుపత్రుల పరిశుభ్రత, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై అవగాహన కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. బ్రిక్స్‌ అనేది బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా తదితర దేశాల మధ్య సహకారానికి ఏర్పడిన అంతర్జాతీయ వేదిక. 2026లో బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్‌ నిర్వహిస్తోంది. ఈ ఏడాది పర్యావరణ అంశాల్లో భాగంగా సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రకృతి వనరులను పొదుపుగా వినియోగించడం, వ్యర్థాలను తగ్గించడం, తిరిగి వినియోగాన్ని పెంచడం, పర్యావరణ హిత అలవాట్లను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆరోగ్యం, పర్యావరణం పరస్పరం విడదీయలేని అంశాలనే విషయాన్ని ప్రజలకు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌ శాఖ కమిషనర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌బాబు తెలిపారు.
Scroll for the next article