News3rd Nov 05:13 PMSunil Byrisetty1 min read
విజయవాడలో బ్రిక్స్ సస్టెయినబుల్ లైఫ్‌స్టైల్ వీక్
ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సస్టెయినబుల్ లైఫ్‌స్టైల్ వీక్ (నవంబర్ 1 నుండి 7 వరకు) కార్యక్రమాలలో భాగంగా, మూడవ రోజు మంగళవారం విజయవాడలోని ప్
ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సస్టెయినబుల్ లైఫ్‌స్టైల్ వీక్ (నవంబర్ 1 నుండి 7 వరకు) కార్యక్రమాలలో భాగంగా, మూడవ రోజు మంగళవారం విజయవాడలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ ప్రిన్సిపల్ ఎం. కనకా రావు మాట్లాడుతూ
"Save Water – నీటిని సంరక్షిద్దాం" అనే ప్రధాన నినాదంతో విద్యార్థులకు, సిబ్బందికి నీటి సంరక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిత్యజీవితంలో నీటి ప్రాముఖ్యత, భూగర్భ జలాల పరిరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, నీటి వృథాను అరికట్టే పద్ధతులపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కుళాయిల ద్వారా నీరు వృథా కాకుండా చూసుకోవడం, లీకేజీలను తక్షణమే అరికట్టడం, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించడం వంటి అంశాలను విద్యార్థులకు వివరించినట్లు ఆయన తెలిపారు. నీరు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వనరు అని, నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నేటి నీటి పొదుపు రేపటి తరాలకు భద్రమైన భవిష్యత్తును అందిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి నీటి వృథాను అరికట్టి, నీటి సంరక్షణను తమ దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.