Politics10th Mar 03:24 PMSunil Byrisetty1 min read

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు: కేటీఆర్

కేసీఆర్ స్థాయి వేరు.. ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీళ్లు మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మా

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు: కేటీఆర్
కేసీఆర్ స్థాయి వేరు.. ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీళ్లు మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది కేసీఆర్ ఆలోచన అని అన్నారు. మోడీని మంచోడు అనకపోతే జైల్లో వేస్తారని, కిషన్ రెడ్డి ఆ పని చేయలేని నిస్సహాయుడని ఎద్దేవా చేశారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం ముందు కృషి చేసింది తామేనని, కానీ వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వెనక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని ఆరోపించారు. వందల, వేల కోట్ల కుంభకోణానికి నలుగురు బ్రోకర్లతో సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దాసోజు శ్రవణ్ ను 2023లో నామినేట్ చేస్తే.. అప్పుడు బీజేపీ ఆపిందన్నారు. అందుకే కేసీఆర్ మళ్ళీ గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని కేటీఆర్ వివరించారు.
KCR
Telangana
KTR
Assembly
కేసీఆర్
తెలంగాణ
కేటీఆర్
అసెంబ్లీ
Scroll for the next article