Telangana25th Jan 03:06 PMSunil Byrisetty1 min read

ABNపై బ్యాన్ పెట్టిన BRS

ఇటీవల ఏబీఎన్ చానల్ లో నిర్వహించిన డిబేట్ రచ్చకు దారితీసింది. దీంతో ఇకపై అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ABN ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదంటూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ABN ట

ABNపై బ్యాన్ పెట్టిన BRS
ఇటీవల ఏబీఎన్ చానల్ లో నిర్వహించిన డిబేట్ రచ్చకు దారితీసింది. దీంతో ఇకపై అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ABN ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదంటూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ABN టీవీ ఛానల్ చర్చల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన రాదని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇటీవల జరిగిన ABN టీవీ చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కల పల్లి రవీందర్ రావును అవమానించేలా "గెట్ ఔట్ ఫ్రమ్ మై ఛానల్" అంటూ ఛానల్ వ్యాఖ్యాత వెంకటకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏబీఎన్ పై బ్యాన్ పెడుతూ బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది.
Telangana
BRS
ABN Channel
Media Ban
Political Controversy
TV Debate
Party Decision
Venkatakrishna
వెంకటకృష్ణ
తక్కలపల్లి రవీందర్ రావు
BRS ఎమ్మెల్సీ
టీవీ చర్చలు
మీడియా వివాదం
Scroll for the next article