Politics15th Mar 12:40 PMSunil Byrisetty1 min read
ఆంధ్రా డైరెక్టర్‌తో తెలంగాణ గీతమా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఆంధ్రా, తెలంగాణ వాదాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర గీతంపై శాసన మండలిలో మాట్లాడారు. జయహే జయహే తెలంగాణ గీతంపై ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్‌తో పాట
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఆంధ్రా, తెలంగాణ వాదాన్ని తెరపైకి తెచ్చారు.
తెలంగాణ రాష్ట్ర గీతంపై శాసన మండలిలో మాట్లాడారు.
జయహే జయహే తెలంగాణ గీతంపై ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్‌తో పాట రూపొందించడం ఎవరికి అర్థం కాని విషయమని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టు ఆంధ్రావారితో రూపొందించడం సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం అవుతోందన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాలను ఉద్యమ సమయంలో వేలాదిగా పెట్టుకున్నామని, ఆ తెలంగాణ తల్లికి గెజిట్ లేదు, జీవో లేదని అన్నారు.
ఇప్పుడు తెలంగాణ తల్లిని మాములు తల్లిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ, బోనం ఉంటేనే ఒక ప్రత్యేకత అని, ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా చేశారు మెజార్టీ ప్రజలు ఒప్పుకోవడం లేదని చెప్పారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని జైలు గోడలు మీద రాసిన గొప్ప కవి స్వతంత్ర సమరయోధులు దాశరథి శతజయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.