Telangana3rd Sep 09:44 AMSunil Byrisetty1 min read
పతనం దిశగా బీఆర్ఎస్!
తెలంగాణ అంటే టీఆర్ఎస్ .. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నట్లు వెలిగిన పార్టీ ఇప్పుడు పతనం దిశగా నడుస్తోంది. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ సీఎంగా ఉంటారు. ఆయన తెలంగాణ బాపు అని ప్రచారం చేసుకు
తెలంగాణ అంటే టీఆర్ఎస్ .. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నట్లు వెలిగిన పార్టీ ఇప్పుడు పతనం దిశగా నడుస్తోంది. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ సీఎంగా ఉంటారు. ఆయన తెలంగాణ బాపు అని ప్రచారం చేసుకున్నారు. కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిందని.. ఆ బీఆర్ఎస్‌తో తమకు సంబంధం లేదని తెలంగాణ ప్రజలు 2023 డిసెంబర్ లో తీర్పు ఇచ్చారు. అప్పటి వరకూ ఆకాశంలో ఉన్న ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఒక్క సారిగా కిందపడిపోయారు. ఇప్పటి వరకూ లేవలేదు సరి కదా.. రోజు రోజుకు పాతాళంలోకి వెళ్లిపోతున్నారు. కవిత ఇష్యూతో ఆ పార్టీ ఉనికిపైనా ప్రశ్నలు వస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఇప్పుడు చాలా క్లిష్టంగా ఉన్నది మాత్రం నిజం. నాయకత్వ సమస్యలు ఆ పార్టీని పాతాళంలోకి నెట్టేస్తున్నాయి. ఉనికిని కాపాడుకోవడమే ఓ సవాల్‌గా మారింది.