Politics15th Mar 11:29 AMSunil Byrisetty1 min read

జగదీశ్ రెడ్డి కోసం స్పీకర్ వద్దకు బీఆర్ఎస్

తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం అసెంబ్లీ స్పీకర్‌ను కోరింది. స్పీకర్ పట్ల సీనియర్ శాసనసభ్యుడైన జగదీశ్ రెడ్డి అ

జగదీశ్ రెడ్డి కోసం స్పీకర్ వద్దకు బీఆర్ఎస్
తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం అసెంబ్లీ స్పీకర్‌ను కోరింది. స్పీకర్ పట్ల సీనియర్ శాసనసభ్యుడైన జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని వివరించింది. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, సస్పెన్షన్‌కు గురైన సభ్యుడు జగదీశ్ రెడ్డి వివరణ తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. పునఃపరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌కు బీఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు.
BRS
MLA jagadesh reddy
Gaddam prasad
Telangana
జగదీశ్ రెడ్డి
గడ్డం ప్రసాద్‌
Scroll for the next article